当前位置:首页 > 歌词大全 > Mellaga Tellarindoi歌词
  • 作词 : Srimani
    作曲 : Mickey J. Meyer
    మెల్లగా తెల్లారిందోయ్ అల
    వెలుతురే తెచ్చేసిందోయ్ ఇల
    బోసి నవ్వులతో మెరిసే పసి పాపల్లా
    చేదతో బావులలో గలగల
    చెరువులో బాతుల ఈతల కళ
    చేదుగా ఉన్నా వేపను నమిలేవేళా
    చుట్ట పొగ మంచుల్లో
    చుట్టాల పిలుపుల్లో
    మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయంలా
    చలిమంటలు ఆరేలా
    గుడిగంటలు మోగేలా
    సుప్రభాతాలే వినవేలా
    గువ్వలు వచ్చే వేళ
    నవ్వులు తెచ్చే వేళ
    స్వాగతాలవిగో కనవేలా
    పొలమారే పొలమంతా ఎన్నాళ్ళో నువు తలచీ
    కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువు విడచీ
    మొదట అందని దేవుడి గంట
    మొదటి బహుమతి పొందిన పాట
    తాయిలాలకు తహతహలాడిన పసితనమే గురుతొస్తోందా
    ఇంతకన్నా తీయ్యనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాన
    నువ్వూగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల నువ్వెదిగిన ఎత్తే కనబడకా
    నువ్వాడిన దొంగాట బెంగల్లే మిగలాల తన్నెవరు వెతికే వీల్లేకా
    కన్నులకే తియ్యదనం రుచి చూపే చిత్రాలే
    సవ్వడితో సంగీతం పలికించే శలయేళ్ళే
    పూల చెట్టుకి ఉందో భాష
    అలల మెట్టుకి ఉందో భాష
    అర్థమవ్వనివాళ్ళే లేరే అందం మాటాడే భాష
    పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష
    మమతలు పంచే ఊరూ ఏమిటి దానికి పేరూ పల్లెటూరేగా ఇంకెవరూ
    ప్రేమలు పుట్టిన ఊరూ అనురాగానికి పేరూ కాదనేవారే లేరవరూ
  • [00:00.000] 作词 : Srimani
    [00:01.000] 作曲 : Mickey J. Meyer
    [00:36.668] మెల్లగా తెల్లారిందోయ్ అల
    [00:39.222] వెలుతురే తెచ్చేసిందోయ్ ఇల
    [00:41.619] బోసి నవ్వులతో మెరిసే పసి పాపల్లా
    [00:46.230] చేదతో బావులలో గలగల
    [00:49.523] చెరువులో బాతుల ఈతల కళ
    [00:52.084] చేదుగా ఉన్నా వేపను నమిలేవేళా
    [00:57.538] చుట్ట పొగ మంచుల్లో
    [00:59.882] చుట్టాల పిలుపుల్లో
    [01:02.462] మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయంలా
    [01:08.727] చలిమంటలు ఆరేలా
    [01:10.997] గుడిగంటలు మోగేలా
    [01:13.527] సుప్రభాతాలే వినవేలా
    [01:18.882] గువ్వలు వచ్చే వేళ
    [01:21.425] నవ్వులు తెచ్చే వేళ
    [01:23.978] స్వాగతాలవిగో కనవేలా
    [01:55.787] పొలమారే పొలమంతా ఎన్నాళ్ళో నువు తలచీ
    [02:05.916] కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువు విడచీ
    [02:16.109] మొదట అందని దేవుడి గంట
    [02:18.423] మొదటి బహుమతి పొందిన పాట
    [02:21.008] తాయిలాలకు తహతహలాడిన పసితనమే గురుతొస్తోందా
    [02:26.229] ఇంతకన్నా తీయ్యనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాన
    [02:37.052] నువ్వూగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల నువ్వెదిగిన ఎత్తే కనబడకా
    [02:47.398] నువ్వాడిన దొంగాట బెంగల్లే మిగలాల తన్నెవరు వెతికే వీల్లేకా
    [03:02.994] కన్నులకే తియ్యదనం రుచి చూపే చిత్రాలే
    [03:13.631] సవ్వడితో సంగీతం పలికించే శలయేళ్ళే
    [03:23.969] పూల చెట్టుకి ఉందో భాష
    [03:26.347] అలల మెట్టుకి ఉందో భాష
    [03:28.909] అర్థమవ్వనివాళ్ళే లేరే అందం మాటాడే భాష
    [03:34.047] పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష
    [03:44.908] మమతలు పంచే ఊరూ ఏమిటి దానికి పేరూ పల్లెటూరేగా ఇంకెవరూ
    [03:55.211] ప్రేమలు పుట్టిన ఊరూ అనురాగానికి పేరూ కాదనేవారే లేరవరూ